జియో కొత్త ప్లాన్స్‌ వచ్చేశాయ్‌! | Reliance Jio Plans Revised; Jio Dhan Dhana Dhan Benefits Continue With Rs. 399 Pack | Sakshi
Sakshi News home page

జియో కొత్త ప్లాన్స్‌ వచ్చేశాయ్‌!

Published Tue, Jul 11 2017 3:48 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

జియో కొత్త ప్లాన్స్‌ వచ్చేశాయ్‌!

జియో కొత్త ప్లాన్స్‌ వచ్చేశాయ్‌!

ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ ప్రయోజనాలు, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా.. రిలయన్స్‌ జియో తన ప్లాన్స్‌ను సవరించింది. అంతేకాక రెండు సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది.

ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ ప్రయోజనాలు, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా.. రిలయన్స్‌ జియో తన ప్లాన్స్‌ను సవరించింది. అంతేకాక రెండు సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. రూ.399, రూ.349 ఎంఆర్పీలతో ఈ కొత్త జియో ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌లో భాగంగా రూ.349 రీఛార్జ్‌తో 20జీబీ 4జీ డేటాను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే డైలీ ఇంత డేటానే వాడుకోవాలి అనే పరిమితి ఏమీ లేదు. ఒక్కసారి 20జీబీ డేటా అయిపోయిన తర్వాత స్పీడు కూడా 128కేబీపీఎస్‌కు పడిపోతుంది.
 
మరో కొత్త ప్లాన్‌ రూ.399 కింద మూడు నెలల పాటు అపరిమిత సర్వీసులను వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌ అచ్చం ముందస్తు ప్రకటించిన రూ.309 ప్లాన్‌ మాదిరిగానే ఉంది. ఈ ప్లాన్‌లో జియో డేటా పరిమితిని విధించింది. రోజుకు 1జీబీ డేటాను మాత్రమే వినియోగించుకునే అవకాశముంటుంది. ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ ఇప్పుడు కేవలం రూ.399 ప్లాన్‌కే 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని తెలిసింది. ఈ మార్పులు మినహా తొలి రీఛార్జ్‌ పొందే మిగతా ప్రయోజనాలన్నీ సమానంగా ఉంటాయని కంపెనీ చెప్పింది. ప్రీపెయిడ్‌ ప్లాన్లు రూ.19 నుంచి ప్రారంభమై, రూ.9999 వరకు ఉన్నాయి. 
 
ప్రస్తుతం రూ.309, రూ.509 ప్లాన్స్‌ కూడా రెండు నెలల పాటు వాలిడిటీలో ఉన్నాయి. రూ.309 ప్లాన్‌ కింద 60జీబీ డేటాను, రూ.509 ప్లాన్‌ కింద 128జీబీ డేటాను జియో అందిస్తోంది. రూ.999 ప్లాన్‌ కింద రూ.90జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు..  ఎవరైతే రూ.309 ప్లాన్‌ను కొనసాగించాలనుకుంటున్నారో వారు ఆ ప్రయోజనాలు వినియోగించుకోవచ్చు.. అంటే రూ.309 రీఛార్జ్‌పై రెండు నెలల పాటు అపరిమిత సర్వీసులు అందుతాయి. అన్ని దీర్ఘకాలిక ప్లాన్స్‌ను కూడా ఒక నెల అదనపు ప్రయోజనాలతో కంటిన్యూ చేసుకోవచ్చని జియో చెప్పింది. అంతేకాక ఈడీఎంవీ ప్లాన్స్‌ను జియో ప్రకటించింది. రూ.149 ప్లాన్స్‌ లో ఎలాంటి మార్పులను జియో చేపట్టలేదు. కొత్త కస్టమర్లు రూ.99 చెల్లించే జియో ప్రైమ్‌ను ఎన్‌రోల్‌ చేసుకోవచ్చని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement