సెకన్లలో ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్ | All of Xiaomi Mi 6 stocks find takers within seconds | Sakshi
Sakshi News home page

సెకన్లలో ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్

Apr 29 2017 5:16 PM | Updated on Sep 5 2017 9:59 AM

సెకన్లలో ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్

సెకన్లలో ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్

ఫ్లాష్ సేల్ కు వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి.

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి ఏదైనా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తుందంటే చాలు. ఆన్ లైన్ వినియోగదారులందరూ ఎప్పుడెప్పుడు కొంద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ కంపెనీ ఫోన్లు ఫ్లాష్ సేల్ కు వచ్చిన సెకన్లలో అమ్ముడుపోతున్నాయి.  ఇదే తరహాలో ఇటీవలే అదిరిపోయే ఫీచర్లతో చైనా మార్కెట్లోకి వచ్చిన ఎంఐ 6 ఫ్లాగ్ షిప్ కు అనూహ్య స్పందన వచ్చింది. నిన్న చైనాలో ఈ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు వచ్చింది. ఫ్లాష్ సేల్ కు వచ్చిన వెంటనే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. సెకన్లలోనే స్టాకంతా అమ్ముడుపోయినట్టు కంపెనీ ప్రకటించింది.
 
ఎంఐ 6 తర్వాతి ఫ్లాష్ సేల్ మే 5న కంపెనీ నిర్వహించనుంది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రిపోర్టులైతే, ఎంఐ6ను భారత్ లో లాంచ్ చేయడం లేదని చెబుతున్నాయి. కంపెనీ సైతం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  2.45గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 6జీబీ ర్యామ్,  64/128జీబీ స్టోరేజ్, డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా, ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు వైపులు కర్వ్డ్ గ్లాస్/ సెరామిక్ బాడీ, 3,350ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్ ధర సుమారు రూ.23,999గా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement