ఈ స్మార్ట్‌ఫోన్లకు గ్లోబల్‌గా మస్తు గిరాకీ! | 5 most-popular smartphones worldwide | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ఫోన్లకు గ్లోబల్‌గా మస్తు గిరాకీ!

Aug 19 2017 4:10 PM | Updated on Sep 12 2017 12:30 AM

కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్స్‌తో రోజురోజుకు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ కూడా విపరీతంగా విస్తరిస్తోంది.



ప్రతి వారం  ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలవుతూ.. వినియోగదారులను అలరిస్తూనే ఉంది. కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్స్‌తో రోజురోజుకు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ కూడా విపరీతంగా విస్తరిస్తోంది. అయితే వీటిలో ఏ ఏ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి? బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్లుగా ఏవి నిలుస్తున్నాయి? అంటే.. ఈ క్వార్టర్‌లో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ వచ్చిన స్మార్ట్‌ఫోన్ల జాబితాను రీసెర్చ్‌ కంపెనీ స్ట్రాటజీ అనాలిటిక్స్‌ తన క్వార్టర్లీ రిపోర్టులో వెల్లడించింది. 
 
2017 క్యూ 2 ఎక్కువగా సేల్‌ అయిన స్మార్ట్‌ఫోన్లు...
 
ఆపిల్‌ ఐఫోన్‌ 7... ప్రారంభ ధర రూ.56,200
ఆపిల్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ 7, ఈ క్వార్టర్‌లో ఎక్కువగా మార్కెట్‌ షేరును సంపాదించుకుంది. 4.7 శాతం మార్కెట్‌ షేరుతో 16.9 మిలియన్‌ యూనిట్లు ఈ క్వార్టర్‌లో అమ్ముడుపోయాయి. 
 
ఆపిల్‌ ఐఫోన్‌ 7 ప్లస్‌.. ప్రారంభ ధర రూ.76,300
ఐఫోన్‌ 7లో అతిపెద్ద వేరియంట్‌ ఈ ఐఫోన్‌ 7 ప్లస్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ 7 తర్వాత రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ క్వార్టర్‌లో 4.2 శాతం మార్కెట్‌ షేరును సంపాదించుకున్న ఐఫోన్‌ 7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌, 15.1 మిలియన్‌ యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది.  
 
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8... ధర రూ.57,900
దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 10.2 మిలియన్‌ హ్యాండ్‌సెట్ల షిప్‌మెంట్లతో ఇది 2.8 శాతం మార్కెట్‌ షేరును దక్కించుకుంది. 
 
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌... ప్రారంభ ధర రూ.64,900
గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ క్వార్టర్‌లో 2.5 శాతం మార్కెట్‌ షేరును సంపాదించింది. ఈ క్వార్టర్‌లో 9 మిలియన్‌ యూనిట్లు రవాణా అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విక్రయాలను నమోదుచేసిన స్మార్ట్‌ఫోన్లలో గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌, నాలుగో స్థానంలో నిలిచింది. 
 
షావోమి రెడ్‌మి 4ఏ... ధర రూ.5,999
ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ మధ్యలో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 4ఏ ఐదో స్థానంలో నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండో క్వార్టర్‌లో 5.5 మిలియన్‌ యూనిట్ల సరుకు రవాణాను రికార్డు చేశాయి. గ్లోబల్‌గా ప్రస్తుతం దీని మార్కెట్‌ షేరు 1.5 శాతం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement