తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు.
హిందూపురంలో ఉద్రిక్తత
Apr 19 2017 12:11 PM | Updated on May 25 2018 9:20 PM
అనంతపురం: తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. జిల్లాలోని హిందూపురంలో తీవ్ర నీటి ఎద్దటి ఉండటంతో.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానికులంతా కలిసి ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుకు నిరసనగా దున్నపోతులపై పెయింటింగ్‌లతో ప్రదర్శన చేపట్టారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీలతో తెగబడ్డారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Advertisement
Advertisement