ఏపీ అసెంబ్లీ వద్ద కలకలం | women suicide attempt at ap assembly in velagapudi | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ వద్ద కలకలం

Mar 15 2017 1:37 PM | Updated on Aug 18 2018 5:15 PM

ఏపీ అసెంబ్లీ వద్ద కలకలం - Sakshi

ఏపీ అసెంబ్లీ వద్ద కలకలం

ఏపీ అసెంబ్లీ వద్ద ఒక యువతి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

- అసెంబ్లీ గేటు ముందు యువతి ఆత్మహత్యాయత్నం
 
అమరావతి: ఏపీ అసెంబ్లీ వద్ద ఒక యువతి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఏపీ అసెంబ్లీ రెండో గేట్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలివీ.. శ్రీకాకుళానికి చెందిన కళ్యాణి నాలుగో తరగతి ఉద్యోగినిగా పనిచేస్తోంది. తనకు కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు వేతనం ఇవ్వటం లేదని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై సీఎంను కలిసేందుకు ఆమె బుధవారం ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీ వద్దకు వచ్చింది. అయితే లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు.
 
దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది వెంటనే ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. గతంలోనూ ఇదే విధంగా ప్రయత్నించగా ముఖ్యమంత్రి ఆమెకు రూ. 25 వేలు అందజేశారని.. అప్పటి నుంచి కల్యాణి ఇలా వ్యవహరిస్తూ హంగామా చేస్తుంటుందని ఆమె స్నేహితులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement