భోగాపురంలో అప్రకటిత కర్ఫ్యూ | Unstated Karfu Weather in bhogapuram | Sakshi
Sakshi News home page

భోగాపురంలో అప్రకటిత కర్ఫ్యూ

Jan 11 2017 11:53 AM | Updated on Sep 5 2017 1:01 AM

(ఫైల్‌ ఫొటో)

(ఫైల్‌ ఫొటో)

విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజలకు, సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు కూడా రెవెన్యూ సిబ్బంది ఆహ్వానం పంపారు. తీరా ప్రజాభిప్రాయ సేకరణ సమయానికి వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయింది. ప్రశ్నలు సంధిస్తారని అనుమానం వచ్చిన వారిని హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను బయటికి రాకుండా నిర్బంధిస్తున్నారు. కేవలం టీడీపీ అనుకూలమైన నాయకులను మాత్రం ప్రజాభిప్రాయసేకరణ సమావేశానికి అనుమతిస్తున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement