సంచలన రీతిలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు పరారైన సంఘటనలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఖైదీల పరారీ: జైలు సిబ్బందిపై వేటు
Nov 20 2016 3:03 PM | Updated on Sep 4 2017 8:38 PM
వరంగల్: సంచలన రీతిలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు పరారైన సంఘటనలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైనిక సింగ్, బీహార్‌కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జైలు గోడ దూకి పరారుకాగా, జైలు సిబ్బందే ఖైదీలకు సహకరిచారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఇద్దరు సిబ్బందిపై సస్సెన్షన్ వేటు వేశారు. ఘనట వెలుగు చూసిననాడే జైల్ సూపరింటెండెంట్ న్యూటన్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
దుప్పట్ల సహాయంతో జైలు గోడ దూకి పరారైన ఖైదీల కోసం వరంగల్ అర్బన్ పోలీస్‌లు గాలిస్తున్నారు. కాగా, జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అనారోగ్యం పేరుతో పెరోల్ మీద బయటకు వెళ్లేందుకు సహకరిస్తోన్న ఇద్దరు నర్సింగ్ సిబ్బందితోపాటు ఎంజీఎం, కేఎంసీకి చెందిన ఇద్దరు డాక్టర్లపై జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వైద్యులపై మట్టెవాడ పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement