పట్టాలు తప్పిన మరో గూడ్స్‌.. మూడో ఘటన | Two coaches of goods train go off track near Khandala | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన మరో గూడ్స్‌.. మూడో ఘటన

Sep 7 2017 5:46 PM | Updated on Sep 17 2017 6:32 PM

పట్టాలు తప్పిన మరో గూడ్స్‌.. మూడో ఘటన

పట్టాలు తప్పిన మరో గూడ్స్‌.. మూడో ఘటన

మరో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని ఖాండాలకు సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు పక్కకు వెళ్లాయి.

ముంబయి: మరో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని ఖాండాలకు సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. గడిచిన కొన్ని గంటల్లోనే ఇది మూడో  సంఘటన. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు ఢిల్లీలో ఓ రైలు, ఉత్తర ప్రదేశ్‌లో ఓ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన ప్రమాదంలో పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ మార్గాన వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు అక్కడి చేరుకొని ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. ఆధారాల పరిశీలన బృందాలు అక్కడి చేరుకొని తనిఖీలు చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement