ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఆత్మహత్య | The Govt teacher commits suicide | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

Sep 28 2016 10:01 AM | Updated on Sep 4 2017 3:24 PM

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎల్‌బీఎస్ నగర్‌లో నివాసముంటున్న వి. నాగమణి(38) కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement