ఆయన పురుషుడే! | Swamy Nithyananda sexual potency test shows positive | Sakshi
Sakshi News home page

ఆయన పురుషుడే!

Nov 27 2014 8:25 AM | Updated on Sep 2 2017 5:10 PM

ఆయన  పురుషుడే!

ఆయన పురుషుడే!

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సంబంధించిన పురుషత్వ పరీక్షల నివేదిక రామనగర సెషన్స్ కోర్టుకు బుధవారం చేరింది.

కోర్టుకు చేరిన నిత్యానంద పురుషత్వ పరీక్షల నివేదిక
31 పేజీల నివేదికను అందజేసిన సీఐడీ
కేసు విచారణ  డిసెంబర్ 3కు వాయిదా

 
బెంగళూరు :  వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సంబంధించిన పురుషత్వ పరీక్షల నివేదిక రామనగర సెషన్స్ కోర్టుకు బుధవారం చేరింది. తాను ఆరేళ్ల బాలుడులాంటి వాడినని అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిత్యానంద గతంలో కోర్టుకు విన్నవించిన విషయం తెల్సిందే. అయితే పురుషత్వ పరీక్షల్లో ఆయన ‘ పురుషుడే’ అని నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం.  పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో నిపుణుల సమక్షంలో పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన 31పేజీల నివేదికను కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం డీఎస్‌పీ లోకేష్ బుధవారం రామనగర్‌లోని సెషన్స్ కోర్టుకు అందించారు. ఇదే కేసుకు సంబంధించి ఆయనకు నిర్వహించిన ధ్వని సంబంధ పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. విచారణ సందర్భంగా  నిత్యానందతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఆయన శిష్యులు కోర్టుకు హాజరయ్యారు.  మరోవైపు నిపుణుల నిర్వహించిన పరీక్షల్లో నిత్యానంద తన వయసు తగ్గట్టు శారీరక, మానసిక పరిపక్వత చెందారని... అందువల్ల ఆయన పురుషత్వ పరీక్షల్లో ‘పాస్’ అయినట్లు తేలిందని విశ్వసనీయ సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement