 
															ఆ కుటుంబంలో కొనసాగుతున్న వార్
ఈ క్రమంలో బుధవారం ఆరోసారిగా దినకరన్ బెంగళూరు జైలుకు వెళ్లి శశికళను కలిసి మాట్లాడారు.
	► నేడు చిన్నమ్మ కేసు విచారణ
	► శశికళను కలిసిన దినకరన్
	
	
	కేకేనగర్: అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉన్న దినకరన్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం చెన్నై బీసెంట్ నగర్‌లోగల తన ఇంట్లో ప్రతి రోజూ మద్దతుదారులతో కలిసి సమావేశాలు జరుపుతున్నారు. తరచూ పరప్పన అగ్రహారినికి వెళ్లి శశికళతో కలిసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు శశికళను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమెను కలిసినప్పుడు పార్టీలో జరుగుతున్న గందరగోళం, సమస్యల గురించి మాట్లాడేవారని తెలుస్తోంది.
	
	ఈ క్రమంలో బుధవారం ఆరోసారిగా దినకరన్ బెంగళూరు జైలుకు వెళ్లి శశికళను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో శశికళ దినకరన్‌తో పార్టీ పాలన విషయాల్లో తలదూర్చవద్దని, రాజకీయ విషయమై పర్యటనలు చేయవద్దని హితవు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకనూ మద్దతుదారులతో బహిరంగ సభలు, పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం వంటివి చేయవద్దని శశికళ ఆదేశించినట్లు సమాచారం.
	
	7వ తేదీ విచారణ :
	తనపై విధించిన శిక్షను రద్దు చేయాలని గత మే నెల 17వ తేదీ శశికళ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణను జూలై 7వ తేదీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తమ చిన్నమ్మ విడుదల కావాలని ఆమె మద్దతుదారులు, కుటుంబ సభ్యులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ముంబైలో కూడా ఆమె పేరుతో యాగాలు చేస్తున్నట్లు సమాచారం.
	
	శశికళ కుటుంబంతో కొనసాగుతున్న వార్ :
	టీటీవీ దినకరన్ మాటలను వినకపోవడం ఇంకనూ తన పలుకు బడిని అందరికీ తెలిపే విధంగా మన్నార్‌కుడిలో జూలై 18వ తేదీ ఎంజీఆర్ శతదినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ జైలు నుంచి విడుదలైన టీటీవీ దినకరన్ పార్టీకి రాకూడదని సీనియర్ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా శశికళ తమ్ముడు దినకరన్ మేనమామ అయిన దివాకరన్, దినకరన్ పార్టీలోనికి రాకూడదని తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాడు. ఈనేపథ్యంలో మేనమామను మంచి చేసుకోడానికి దినకరన్ తన మద్దతుదారులను రాయబారానికి పంపినా ఎలాంటి పొత్తు కుదరకపోవడంతో శశికళ కుటుంబంలో వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
