గణతంత్ర వేడుకలను సోమవారం ఉదయం ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను సోమవారం ఉదయం ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ఈ సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ పోలీస్ బెటాలియన్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఎకే. సింఘాల్, అదనపు రెసిడెంట్ కమిషనర్ డా.అర్జశ్రీకాంత్, ఏపీ భవన్ సిబ్బంబది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.