కోలార్ జిల్లాలో త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ | Railway coach factory in Kolar district | Sakshi
Sakshi News home page

కోలార్ జిల్లాలో త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

Aug 16 2013 4:26 AM | Updated on Sep 1 2017 9:51 PM

కేంద్ర, రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి యూటీ ఖాదర్ అన్నారు.

కోలారు, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి యూటీ ఖాదర్ అన్నారు. గురువారం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఖాదర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ... కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాదాపు ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వైట్ ఫీల్డ్ నుంచి కోలారు మీదుగా ముళబాగిలు వరకు 83 కిమీ రైల్వే లైన్‌ను రూ. 658 కోట్ల వ్యయంతో,  అదే విధంగా మారికుప్పం  - కుప్పం నూతన రైలు మార్గాన్ని త్వరలో ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు.

వేమగల్ సమీపంలో టోల్‌రూం స్థాపన వల్ల నిరుద్యోగ సమస్య కొంత వరకు తీరనుందన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత నీటి సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్వాతంత్య్ర వేడుకల కోసం ఎస్‌సీ, ఎస్‌టీ సెల్‌కు నగర సభ కమిషనర్ రూ. 10 లక్షలు ఇచ్చిన విషయాన్ని పాత్రికేయులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి, కమిషనర్ మహేంద్రకుమార్‌ను తీవ్రంగా మందలించారు. విలేకరుల సమావేశంలో సీఈఓ జుల్ఫికరుల్లా, డిప్యూటీ కలెక్టర్ వెంకటేషమూర్తి, ఎస్పీ రాంనివాస్ సెపాట్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement