అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం | Pune development plan for 30 years gets nod | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం

Dec 6 2013 12:32 AM | Updated on Sep 2 2017 1:17 AM

నగరం ఇక అభివృద్ధి దిశగా పరుగులు తీయనుంది. రానున్న మూడు దశాబ్దాల కాలానికి సంబంధించి రూపొందించిన నగర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ)కు పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఆమోదం తె లిపింది.

పుణే: నగరం ఇక అభివృద్ధి దిశగా పరుగులు తీయనుంది. రానున్న మూడు దశాబ్దాల కాలానికి సంబంధించి రూపొందించిన నగర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ)కు పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఆమోదం తె లిపింది. ఈ ప్రణాళిక అమలుకు అయ్యే మొత్తాన్ని జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునరాభివృద్ధి పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద కేంద్ర ప్రభుత ్వం అందజేస్తుంది. ఈ ప్రణాళికకు బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు తమ ఆమోదముద్ర వేశారు. కాగా జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునరాభివృద్ధి పథకం కింద ఎంపికైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద నిధులను అందజేయనుంది.
 
 ఈ విషయమై పీఎంసీ ఇంజనీర్ ప్రశాంత్ వాఘ్మారే బుధవారం మీడియాతో మాట్లాడుతూ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం మార్గదర్శకాలకు లోబడి సీడీపీని రూపొందించామన్నారు. కాగా అనేక అధ్యయనాల అనంతరం పీఎంసీ నగర అభివృద్ధి ప్రణాళికను రూపొం దించింది. అంతేకాకుండా అనేకమంది నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించింది. దీంతోపాటు నగరవాసుల అభిప్రాయాలను కూడా సేకరించింది.  ఆ తర్వాతే ఈ ప్రణాళికకు తుదిరూపు ఇచ్చింది. ఈ విషయమై పీఎంసీ కమిషనర్ మహేష్ పాఠక్ మాట్లాడుతూ పెద్ద పెద్ద ప్రాజెక్టులను సమర్థంగా చేపట్టేందుకు  నగర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ) దోహదం చేస్తుందన్నారు. కాగా రూ. 88.443 కోట్లతో సంబంధిత అధికారులు ఈ ప్రణాళికను రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement