సిరిసిల్లలో ఉద్రిక్తత | protest-for-sircilla-district | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ఉద్రిక్తత

Sep 9 2016 1:02 PM | Updated on Sep 4 2017 12:49 PM

సిరిసిల్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సిరిసిల్ల: సిరిసిల్లను ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు తీవ్రతరం దాల్చుతున్నాయి. సిరిసిల్లను జిల్లా కేంద్రం చేయాలని అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమకారులు ఐటీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా.. తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement