నాసిక్‌లోని సెంట్రల్ జైలులో బుధవారం తెల్లవారుజామున జరిగిన గొడవలో ఒక ఖైదీ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు
సెంట్రల్ జైలులో గొడవ : ఖైదీ మృతి
Oct 16 2013 11:12 PM | Updated on Sep 1 2017 11:41 PM
సాక్షి, ముంబై: నాసిక్‌లోని సెంట్రల్ జైలులో బుధవారం తెల్లవారుజామున జరిగిన గొడవలో ఒక ఖైదీ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుణ్ణి విశాల్ చౌదరి (21)గా గుర్తించారు. గాయపడిన ఖైదీ విజయ్ ఇప్పర్‌ను చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించారు. అందిన సమాచారం మేరకు... సుమారు ఒంటి గంట ప్రాంతంలో సోపాన్ పగారే అనే ఖైదీతో విశాల్, రమేశ్‌లకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో విశాల్‌ను పగారే దారుణంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు కొన్ని గంటల తర్వాత మృతి చెందాడు. రమేశ్‌ను ముంబైలోని జేజే ఆస్పత్రిలో చేర్పించాలని పోలీసులు యోచిస్తున్నారు. కాగా, గత కొన్ని నెలల్లో నాసిక్ సెంట్రల్ జైలులో ఇప్పటివరకు 14 సార్లు ఘర్షణలు జరిగాయి.
Advertisement
Advertisement