
కర్ణాటక, బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో ఈనెల 3న జరగనున్న బాలీవుడ్ నటి సన్నీలియోన్ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని మాన్యత టెక్ పార్క్‌లో నిర్వహిస్తున్న సన్నీ నైట్ ఫ్యాషన్ కార్యక్రమంలో సన్నీలియోన్ పాల్గొననున్నారు. దీంతో వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సన్నీలియోన్ వస్తుండగా కొన్ని కన్నడ సంఘాల వారు వ్యతిరేకిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నారు.