బెంగళూరు నగరంలోని మహారాణి ఉమెన్స్ ఆర్ట్స్ కామర్స్ మేనేజ్‌మెంట్ కాలేజీలో శుక్రవారం అందాల పోటీలు నిర్వహించారు.
యలహంక: బెంగళూరు నగరంలోని మహారాణి ఉమెన్స్ ఆర్ట్స్ కామర్స్ మేనేజ్‌మెంట్ కాలేజీలో శుక్రవారం అందాల పోటీలు నిర్వహించారు. ఈ అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన హిమబిందు విజేతగా నిలిచి మిస్‌మహరాణి–2017 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విద్యార్థిణిలు పాల్గొనగా హిమబిందు విజేతగా నిలిచినట్లు కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన కుశల, చేతన, గీతాలు తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శాంతకుమారి తదితర సిబ్బంది పాల్గొన్నారు.