breaking news
maharani College
-
మహారాణి కాలేజీలో అందాలపోటీలు..
యలహంక: బెంగళూరు నగరంలోని మహారాణి ఉమెన్స్ ఆర్ట్స్ కామర్స్ మేనేజ్మెంట్ కాలేజీలో శుక్రవారం అందాల పోటీలు నిర్వహించారు. ఈ అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన హిమబిందు విజేతగా నిలిచి మిస్మహరాణి–2017 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విద్యార్థిణిలు పాల్గొనగా హిమబిందు విజేతగా నిలిచినట్లు కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన కుశల, చేతన, గీతాలు తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శాంతకుమారి తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
‘మహారాణి’ పరువు పోయింది !
ఇది బెంగళూరులోని మహరాణి మహిళా కళాశాల... ఈ కళాశాల వద్ద ఇంత మంది పోలీసులు ఉన్నారంటే పోకిరీల పనిపట్టడాని కోసం అనుకుంటే మీరు పొరబడినట్లే.. శనివారం ఉదయం ఈ కళాశాల విద్యార్థినులు రెండు జట్లుగా విడిపోయి జుట్లు పట్టుకుని ఆ కళాశాల పరువు తీశారు. ఈ సంఘటన నగర వాసులను నివ్వెరపరిచింది. ఓ లెక్చరర్ బదిలీ విషయమై ఈ రెండు వర్గాల విద్యార్థినులు వీధిలోకి వచ్చి కొట్టుకోవడంతో పోలీసులు వచ్చి విడిపించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద భద్రత నిర్వహిస్తున్న దృశ్యమే ఇది. బెంగళూరు: మహరాణి కళాశాల విద్యార్థినులు కొట్లాటకు దిగారు. పరీక్షల సమయంలో చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థినులు జుట్లుజుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వివరాలు....మహారాణి కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ బదిలీ విషయం పై కొన్ని రోజులుగా మహారాణి కళాశాల విద్యార్థినులు పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రొఫెసర్ బదిలీని నిలిపేయాలని కొందరు విద్యార్థినులు డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రొఫెసర్ బదిలీ సబబేనని మరికొంత మంది విద్యార్థినులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మహారాణి కళాశాల ప్రాంగణంలో ఉన్నట్టుండి ఆర్ట్స్, కామర్స్ విభాగాలకు చెందిన విద్యార్థినులు ఇదే విషయంపై చర్చకు దిగారు. ఈ చర్చ చిలికి చిలికి గాలి వానగా మారి ఇరు విభాగాల విద్యార్థినుల మధ్య గొడవకు దారి తీసింది. పోలీసులు అడ్డుపడి వారిని విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన పోలీసులు కళాశాలకు సెలవు ప్రకటించి విద్యార్థినులను ఇళ్లకు పంపించేశారు.