ఇక గ్లామర్‌తో రెచ్చిపోతా! | oonam Bajwa says that glamour alone cannot make a film hit | Sakshi
Sakshi News home page

ఇక గ్లామర్‌తో రెచ్చిపోతా!

Aug 10 2015 2:56 AM | Updated on Sep 3 2017 7:07 AM

ఇక గ్లామర్‌తో రెచ్చిపోతా!

ఇక గ్లామర్‌తో రెచ్చిపోతా!

ఇక గ్లామర్‌తో విజృంభిస్తానంటోంది నటి పూనంబాజ్వా. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా

ఇక గ్లామర్‌తో విజృంభిస్తానంటోంది నటి పూనంబాజ్వా. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా ఎందుకనో సరైన స్థాయికి చేరుకోలేదిఉత్తరాదిభామ. తమిళంలో కచేరి, ఆరంభం, ద్రోహి, తెనావెట్టు, తంబికోట్టై చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయినా మంచి సక్సెస్ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. మధ్యలో ఐటమ్ గర్ల్‌గాను మెరుస్తూనే ఉంది. ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తున్నారేంటి అని అడిగితే నటిస్తే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న పూనంబాజ్వా ఇకపై ఇంకా గ్లామరస్‌గా నటిస్తానంటోంది. ముంబయిలో నివసిస్తున్న ఈ అమ్మడికి అక్కడ అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తోందట.
 
 అందుకు కారణం చెబుతూ హిందీ చిత్రాల్లో నటించాలంటే దక్షిణాదిలో ప్రముఖ నటిగా రాణించి ఉండాలని అంది. అప్పుడే బాలీవుడ్‌లో గౌరవం, మర్యాద లభిస్తుందని పేర్కొంది. అలా కా కుండా నటిస్తే చిన్న చిన్న పాత్రలే వస్తాయని ఈ భామ అంది. అందుకే తాను హిం దీ చిత్రాలు అవకాశాన్ని అంగీకరించడం లేదని వివరించింది. అయినా హిందీ చిత్రాల్లో నటిస్తేనే పరిపూర్ణ నటి అని ఏమీ లేదు. దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు పొందితే చాలు అంటోంది ఈ అందాలభామ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement