స్థూలకాయంతో బాధపడ్డా! | Namita Caught Between Nudity And Obesity! | Sakshi
Sakshi News home page

స్థూలకాయంతో బాధపడ్డా!

Sep 4 2015 2:14 AM | Updated on Sep 3 2017 8:41 AM

స్థూలకాయంతో బాధపడ్డా!

స్థూలకాయంతో బాధపడ్డా!

స్థూలకాయంతో చాలా చింతించాను. అవకాశాలకు దూరం అయ్యాను. బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు.

 స్థూలకాయంతో చాలా చింతించాను. అవకాశాలకు దూరం అయ్యాను. బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. అయినా ప్రయోజనం లేకపోయింది. చాలా మనస్తాపానికి గురయ్యాను. అలాంటిది 90 కేజీల వరకు బరువు కలిగిన నేను ఇప్పుడు 20 కేజీలు తగ్గాను అన్నారు నటి నమిత. ఈ బ్యూటీకి యూత్‌లో ఉన్నత క్రేజ్ ఏ హీరోయిన్‌కు ఉండదనడం అతిశయోక్తి కాదు. మచ్చాన్ (బావలు) అని ఒక్క ఫ్లయింగ్ కిస్ ఇస్తే చాలు కుర్రకారు గుండెలు గుల్లలైపోతాయి. అలాంటి నమిత వెండితెరకు దూరం అయి చాలా కాలమే అయ్యింది. కారణం విపరీతంగా పెరిగిన ఆమె బరువే.
 
 అయితే తాజాగా నమిత అభిమానులకు శుభవార్త ఏమిటంటే నాటి నమితలా నాజుగ్గా తయారై తెరపైకి త్వరలోనే రానున్నారు. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ స్థూలకాయంతో చాలా అవస్థలు పడ్డాను. తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. అలా విసిగి వేసారి పోయిన తరుణంలో సాక్షి వెల్‌నస్ గురించి నిర్మాత సురేష్ కామాక్షి తెలుసుకున్నా. నమ్మకం లేకపోయినా బరువు తగ్గడానికి ఎన్నో విధాలుగా పెద్ద పోరాటమే చేశాను. మరోసారి ప్రయత్నిస్తే పోయేదేముందని సాక్షి వెల్‌నెస్‌కు వెళ్లాను.
 
 అక్కడ తొలి ప్రయత్నంగా కిలోన్నర బరువు తగ్గాను. కాస్త నమ్మకం కలిగింది. వారి శిక్షణ కారణంగా ఇప్పుడు 20 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాను. మళ్లీ నటిస్తారా? అని అడుగుతున్నారు. నటించడానికే ఇంత నాజుగ్గా తయారైంది ప్రస్తుతం కథలు వింటున్నాను. త్వరలోనే కొత్త చిత్రం గురించి వెల్లడిస్తాను. యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది. అలాగే రాజకీయరంగ ప్రవేశం గురించిన ఆలోచన ఉంది. చాలా పార్టీల వారు ఆహ్వానిస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు చెప్పలేనని నమిత పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement