అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వీసాల విషయంలో సంచనల ప్రకటన చేశారు. షుగర్, ఒబెసిటీ ఉన్నవాళ్లకు యూఎస్ వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈమేరకు కొత్త గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, కాన్యులర్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్లు.. అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితిని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయా? లేదా?, అనే చెక్ చేసేవారు. ఇప్పుడు తాజాగా.. డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే.. అలాంటి వారికి కూడా వీసా ఇచ్చే అవకాశం లేదు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే.. భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులు అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్లే అవవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే.. డయాబెటిస్, ఊబకాయం ఉండే వారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
షుగర్, ఒబెసిటీ వంటి వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. దీనికోసం లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులపై ఎక్కువ ఆర్ధిక భారం మోపుతోంది. దీనికి ప్రభుత్వం ఏమైనా సాయం అందించాలా?, లేకుంటే ప్రభుత్వం సహాయం లేకుండా.. కుటుంబ సభ్యులే సొంతంగా ఖర్చును భరించగలరా? అనే విషయం మీద స్పష్టత ఏర్పరచుకోవాలి. వలసదారుల వల్ల.. అమెరికాలో ఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది.
ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల వీసాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఇన్నాయి. కానీ.. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం ఉంటే కూడా అమెరికా వీసా పొందలేరు. దీన్నిబట్టి చూస్తే.. వీసాలను మరింత పరిమితం చేయడానికి ట్రంప్ కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతోంది.
ఇదీ చదవండి: టయోటా కీలక నిర్ణయం: 10 లక్షల కార్లపై ప్రభావం!


