గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ విస్తృత పర్యటన | MLA Balakrishna wide tour of the villages | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ విస్తృత పర్యటన

Published Thu, Nov 20 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

లేపాక్షి మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ విస్త­ృతంగా పర్యటించారు.

లేపాక్షి:లేపాక్షి మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ విస్త­ృతంగా పర్యటించారు. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరయ్యూరు. మండలంలోని మానేపల్లిలో నిర్మించిన పశువైద్యశాలను ప్రారంభించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శిరివరంలో అయ్యప్పస్వామి శ్రీధర్మశాస్త్ర ఆలయ నిర్మాణం కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజా చేశారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. అనంతరం స్థానిక లేపాక్షి ఆలయంలోని శ్రీదుర్గా వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వచ్ఛ భారత్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఎన్టీర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

లేపాక్షిలోని శివాలయం వద్ద కమ్యూనిటీ హాలు నిర్మాణానికి భూమిపూజ, ఉర్దూ పాఠశాల అదనపు గది, బిసలమానేపల్లిలో తాగునీటి పథకం, సాయిదుర్గా సేవా ట్రస్టు ఆవరణంలో పంచాయతీకి సంబంధించిన మంచినీటి పథకం, కోడిపల్లి, వీభూదిపల్లి గ్రామాల్లోని పాఠశాలలో అదనపు గదులు, కోడిపల్లిలో గోపాలమిత్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం లేపాక్షిలో ఏపీ టూరిజం గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఆర్డీఓ రామ్మూర్తి, తహశీల్దార్ ప్రభాకర్‌బాబు, ఎంపీడీఓ రామాంజినేయులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement