కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం... | kesineni travels bus problem in adanki high way passengers facing problem | Sakshi
Sakshi News home page

కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం...

Sep 12 2016 8:12 AM | Updated on Apr 7 2019 3:24 PM

కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం... - Sakshi

కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం...

కేశినేని ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నల్లగొండ: కేశినేని ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న బస్సు ఆదివారం అర్థరాత్రి నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

దీంతో అర్థరాత్రి నుంచి ప్రయాణికులు నడిరోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. బస్సులో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, షుగర్ వ్యాధిగ్రస్థులతో పాటు మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను నెల్లూరు చేర్చేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటుచేయకపోవడంతో కేశినేని ట్రావెల్స్ యాజమాన్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement