హార్బర్‌ ప్రమాదంతో గ్యాస్‌ కష్టాలు | Gas troubles in Harbour accident | Sakshi
Sakshi News home page

హార్బర్‌ ప్రమాదంతో గ్యాస్‌ కష్టాలు

Feb 8 2017 2:43 AM | Updated on Sep 5 2017 3:09 AM

ఎన్నూర్‌ పోర్టు సమీపంలో రెండు కార్గో నౌకలు ఢీకొన్న సంఘటనతో పోర్టుకు ఇతర నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తమిళనాడు,

పొన్నేరి: ఎన్నూర్‌ పోర్టు సమీపంలో రెండు కార్గో నౌకలు ఢీకొన్న సంఘటనతో పోర్టుకు ఇతర నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తమిళనాడు, ఆంధ్రా, కేరళ  తదితర రాష్ట్రాల ప్రజలకు గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. ఇవి ఏప్పుడు తీరుతాయోనని వినియోగదారులు ఆం దోళన చెందుతున్నారు. మీంజూరు సమీపంలోని అత్తిపట్టులో కేంద్రం ప్రభుత్వానికి సొంతమైన ఇండియన్‌ గ్యాస్‌ కంపెనీ ఉంది. ఇక్కడినుంచి తమిళనాడులోని నలుమూలకు, ఆంధ్రా, కేరళ, తదితర రాష్ట్రాలకు నిత్యం 300పైగా ట్యాంకర్‌ లారీల్లో వంటగ్యాస్‌ సరఫరా చేస్తుంటారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలకు ఇంటి ఉపయోగాల కోసం 200 లారీల్లో గ్యాస్‌ సిలిండర్‌లను సరఫరా చేస్తారు.

అయితే ఎన్నూర్‌ పోర్టు సమీపంలో జరిగిన రెండు నౌకలు ఢీకొన్న ప్రమాదంలో చమురు సముద్రం పాలైన సంగతి తెలిసిందే. దీంతో పోర్టు నుంచి పైప్‌లైన్‌ ద్వారా అత్తిపట్టులోని ఇండియన్‌ గ్యాస్‌ కంపెనీకి గ్యాస్‌ను పంపింగ్‌ చేస్తారు. ఈ క్రమంలో సముద్రంలో ఏర్పడిన ప్రమాదంతో పోర్టు అధికారులు ఎలాంటి నౌకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో గ్యాస్‌ తెచ్చిన ఓడలు మూడు నడి సముద్రంలోనే వారం రోజులుగా ఉన్నాయి.

 దీంతో కంపెనీ లో గ్యాస్‌ లేక రాష్ట్రంలో గ్యాస్‌ సమ స్య తలైతింది. అత్తిపట్టులోని ఇండియన్‌ గ్యాస్‌ కంపెనీ వద్ద గ్యాస్‌ ట్యాం కర్ల లారీలు దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయాయి.  మంగళవారం ఉదయం ఎన్నూర్‌ పోర్టు అధికారులు ఒక ఓడకు మాత్రం అనుమతి ఇచ్చారు. దానిలో దాదాపు 32 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ ఉంది. దీన్ని అధికారులు కొన్ని ట్యాంకర్లలో నింపి పంపారు. మరో వారం రోజుల పాటు ఈ సమస్యలు తప్పవని అధికారులు అంటున్నారు. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందోరన ని జనం అందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement