అప్పులబాధతో కుటుంబం ఆత్మహత్య | family suicide in Tiruvalluru | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో కుటుంబం ఆత్మహత్య

Feb 18 2014 1:01 AM | Updated on Sep 2 2017 3:48 AM

అప్పులు, రుణదాతల ఒత్తిళ్లు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలూ అనంతలోకాలకు వెళ్లిపోవడం స్థానికంగా కలచి వేసింది.

తిరువళ్లూరు, న్యూస్‌లైన్: అప్పులు, రుణదాతల ఒత్తిళ్లు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలూ అనంతలోకాలకు వెళ్లిపోవడం స్థానికంగా కలచి వేసింది. ఈ విషాద సంఘటన తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టు వద్ద చోటు చేసుకుంది. చెన్నై సమీపంలోని పెరంబూరు ప్రాం తానికి చెందిన సుకుమారన్ (45) పెరంబూరులోని రైల్వే గ్యారేజీ వ ర్క్స్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య జయంతి (40). కుమార్తె ఆశా(19), కుమారుడు హరీష్ అలియాస్ జగదీష్(15)తో కలిసి వేపంబట్టులో నివాసం ఉంటున్నాడు. 
 
భార్య జయంతి గృహిణికాగా, కుమార్తె ఆశా చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం, కుమారుడు జగదీష్ సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సుకుమారన్ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం రుణదాతలు కొందరు వచ్చి అప్పు చెల్లించాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో సుకుమారన్ మనస్తాపం చెంది నట్టు బంధువులు చెబుతున్నారు. అప్పులు, గొడవలను పెరంబూరులో ఉన్న బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆదివారం జరిగిన గొడవలపై ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయంతి తమకు అప్పుల భారం ఎక్కువగా ఉందని, తమకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని బంధువుల వద్ద రోదించినట్టు తెలుస్తోంది.
 
అప్పులపై కలత చెందవద్దని వారించిన బంధువులు, సోమవారం మాట్లాడుకుందామని నచ్చచెప్పినట్టు తెలుస్తుంది. సోమవారం మధ్యాహ్నం జయంతి అన్న కొడుకు సతీష్ ఫోన్ చేశాడు. అయితే ఫోన్ తీయలేదు. అనుమానం కలిగిన సతీష్ ఇంటి వద్దకు వచ్చి చూడగా తలుపులకు లోపల గడియ పెట్టి ఉండడం చూశాడు. కిటికీ తెరిచి చూడగా సుకుమార్, జయంతి, ఆశా, జగదీష్‌లు ఉరి వేసుకుని  ఉండడాన్ని గమనించాడు. సెవ్వాపేట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళాలను గడ్డపారతో పగులగొట్టి మృత దేహాలను వెలికితీసి తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. 
 
కారణం ఇదేనా!
పెరంబూరుకు చెందిన సుకుమారన్ వేపంబట్టులో ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలుకు అప్పలు చేసినట్టు తెలుస్తుంది. అప్పలు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ఆత్మహత్యకు గల ప్రధాన కారణంగా పోలీసులు వివరించారు. దీంతో పాటు రైల్వే ఉద్యోగి అయిన సుకుమారన్, అదే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని  2లక్షల నుంచి 4 లక్షల వరకు వ సూలు చేసినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. నగదు ఇచ్చిన వారు కొందరు ఆదివారం ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు నిర్ధారించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement