
పట్టపగలే ఓ మానవ మృగం రెచ్చిపోయింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి కాటేసింది. చిన్నారి పారిపోయేందుకు ప్రయత్నించగా.. తీవ్రంగా గాయపరిచింది. అయినా ఆ చిన్నారిని వణికిపోలేదు. ధైర్యం తెచ్చుకుని.. ఎలాగోలా తప్పించుకుంది. అదే దారి వెంట వస్తున్న మరో చిన్నారిని ఆ కిరాతకుడి బారిన పడకుండా రక్షించగలిగింది.
తమిళనాడులో హృదయవిదారకమైన ఘటన జరిగింది. తిరువళ్లూరులో పదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఓ వ్యక్తి ఆ చిన్నారిని వెంబడించి మరీ ఎత్తుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం రేపిన ఈ పోక్సో కేసులో అనుమానితుడి ఫొటోలను, ఓ వీడియోను జిల్లా పోలీసులు విడుదల చేశారు. అతనికి సంబంధించిన సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జులై 12వ తేదీ జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే..
పదేళ్ల చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి ఒంటరిగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి సమీపంలోని మామిడి తోటల్లో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతను మళ్లీ లాక్కెళ్లి కొట్టాడు. అయితే, ఈలోపు ఆ వ్యక్తికి ఫోన్ కాల్ రావడంతో అతని దృష్టి మరలింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి చిన్నారి తప్పించుకుంది.
కాస్త ముందుగా వెళ్లగా అదే దారిలో కిడ్నాప్ వైపు వెళ్తూ మరో చిన్నారి కనిపించింది. బాధిత చిన్నారి ఆ బాలిక వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అటు వెళ్లొద్దంటూ అక్కడి నుంచి ఊరిలోకి తీసుకెళ్లింది. ఆపై ఇంటికి చేరి అమ్మమ్మకు జరిగినదాన్ని వివరించింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన తమిళనాట దుమారం రేపుతోంది. పౌర సంఘాలతో పాటు విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. డీఎంకే పాలనలో మహిళలకే కాదు.. చిన్నారులకూ రక్షణ లేకుండా పోతోందంటున్నాయి. అన్నామలై వర్సిటీ ఘటన, కదిలే రైలులో గర్బిణిపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇంకోవైపు తిరువళ్లూరు ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రన్నింగ్ ట్రైన్‌లో వచ్చిన నిందితుడు.. బాలికను వెంబడించాడని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదు అయ్యాయని అన్నారు. అతని ఫోన్ రింగ్ టోన్ హిందీ పాట ఉందని బాధిత బాలిక చెప్పిన ఆచూకీతో ఉత్తరాధి నుంచి వచ్చిన వలస కూలీ అయి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.
The suspect in the photos/video is involved in a heinous crime of sexually assaulting a child. It is requested to communicate any information pertaining to him on 9952060948 pic.twitter.com/QBCdi5mQ2K
— Thiruvallur District Police (@TNTVLRPOLICE) July 20, 2025