అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ వరుస విజయాలతో పట్టుసాధించిన కృష్ణానగర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ వరుస విజయాలతో పట్టుసాధించిన కృష్ణానగర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌ను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకులు వేగంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి కుమారుడు, కాం గ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ స్వయంగా చూసుకుంటున్నట్టు సమాచారం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కృష్ణానగర్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గత 20 ఏళ్లుగా వరుస విజయాలతో బీజేపీ నాయకుడుహర్షవర్ధన్ ఈ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోట గా మార్చారు. ఇక్కడ గెలిచేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇప్పటి వరకు వరుసగా నాలుగుసార్లు నలుగురు కొత్త అభ్యర్ధులను బరిలోకి దించినా గెలుపు మాత్రం అందుకోలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంతా భావించారు. చివరకు ముస్లిం ఓట్లను బీఎస్పీ అభ్యర్థి కమ్రుద్దీన్ చీల్చడంతో మరోమారు ఢీలా పడక తప్పలేదు. నియోజకవర్గంలోని మూడు వార్డుల్లో స్పష్టమైన మెజార్టీ తెచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నాలుగో వార్డులో వెనుకబడడంతో స్పల్ప మెజార్టీతో హర్షవర్ధన్ నాలుగోమారు ఎమ్మెల్యే అయ్యారు. ఈమారు పార్టీ టిక్కెట్ డాక్టర్ మోం గా కు ఇస్తే తప్పక గెలుస్తామని కాంగ్రెస్ యోచి స్తోం ది.హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిం చిన వెంటనే అదే రోజు సాయంత్రం ఎంపీ సందీప్
దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహిం చడం గమనార్హం. స్థానిక నేత డాక్టర్ మోంగా ఇం ట్లో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు కాం గ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గెలుపునకు కీలకమైన ముస్లిం ఓట్ల నుంచి ఇతర రాజకీయ సమీకరణాలపై సందీప్ దీక్షిత్ చర్చించినట్టు సమాచారం.
‘హర్షవర్దన్.. క్షమాపణ చెప్పు’
గడచిన 15 ఏళ్లుగా ఢిల్లీలో అత్యవసర చికిత్సావిభా గం (ఐసీయూ)లో ఉందంటూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన మాటలు ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉన్నాయని, వెం టనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ పాలనను భరించలేని ప్రజలు ఆ పార్టీనే 1998 నుంచి ఐసీయూలో ఉంచారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ విమర్శించారు. అందులో నుంచి బీజేపీ బయటపడే అవకాశాలూ కనిపిం చడం లేదన్నారు. ‘ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఢిల్లీ ఒకటని పేరు వచ్చినప్పుడు వర్ధన్ అలాంటి మాటలు ఎలా అంటారు ? ఆయన మాట లు ఢిల్లీవాసులను అవమానించాయి. వర్దన్ వెంట నే క్షమాపణ చెప్పాలి’ అని షీలా దీక్షిత్ పార్లమెం టరీశాఖ కార్యదర్శి కూడా అయిన శర్మ స్పష్టం చేశా రు. కాంగ్రెస్ తన అసమర్థ పాలనతో గత 15 ఏళ్లు గా ప్రజలకు నరకం చూపిస్తోందంటూ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్ ఆరోపించారు. ఈ ఎన్నికలు ముగిసిన తరువాత బీజేపీ పని ముగిసిపోతుందని, అది వెంటిలేటర్‌పైనే జీవిస్తుందని శర్మ వ్యాఖ్యానించారు.