ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ | Distribution free laptops | Sakshi
Sakshi News home page

ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ

Aug 6 2014 3:08 AM | Updated on Sep 2 2017 11:25 AM

తిరుత్తణిలోని ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూలు లో చదువుకొంటున్న విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉపాధ్యాయుల

 తిరుత్తణి :తిరుత్తణిలోని ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూలు లో చదువుకొంటున్న విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు సురేష్ అధ్యక్షత వహిం చారు. తిరుత్తణి మున్సిపాలిటీ అధ్యక్షుడు సౌందరరాజన్, ఉపాధ్యక్షుడు మాసిలామణి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పాఠశాల హెచ్‌ఎం సుబ్బలక్ష్మి అందరినీ ఆహ్వానించి ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా అరక్కోణం పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు హరి పాల్గొని ప్రభుత్వం తరపున విద్యార్థుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం 374 మంది ప్లస్‌టూ విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు మునుస్వామి, సుమతి పుష్పరాజ్, నాగూర్ పిచ్చై, సుబ్రహ్మణ్యస్వామి సహకార విక్రయ సంఘ అధ్యక్షుడు అన్భళగన్, పట్టణ అన్నాడీఎంకే నిర్వాహకులు అన్భు, భరత్, ఉషారాణి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement