డిఫెరెంట్ పాత్రలో ఆండ్రియా | Different Role in Andrea Jeremiah | Sakshi
Sakshi News home page

డిఫెరెంట్ పాత్రలో ఆండ్రియా

Apr 1 2015 1:40 AM | Updated on Sep 27 2018 8:56 PM

డిఫెరెంట్ పాత్రలో ఆండ్రియా - Sakshi

డిఫెరెంట్ పాత్రలో ఆండ్రియా

చాలా బోల్డ్‌గా నటించే కథా నాయికల్లో నటి ఆండ్రియా ఒకరు. అభినయమే కాదు అందాలారబోతకు సరిలేరు

 చాలా బోల్డ్‌గా నటించే కథా నాయికల్లో నటి ఆండ్రియా ఒకరు. అభినయమే కాదు అందాలారబోతకు సరిలేరు నాకెవ్వరూ అనేంతగా పేరు తెచ్చుకున్న నటి ఆమె. ఆయిరత్తిల్ ఒరువన్, అరణ్మణై వంటి పలు చిత్రాల్లో తనదైన శారీరక భాషతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బూటీ తాజాగా తరమణి చిత్రంతో తనలోని బహుపార్వ్సాల్ని ఆవిష్కరించ నున్నారట. నగర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇంతవరకు తెరపై చూడనటువంటి పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారట. ధనం, మోహం, కామం ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే తరమణి చిత్ర కథలో ప్రేమ అంతర్లీనంగా ఉంటుందని నటి ఆండ్రియ మూడు డిఫరెంట్ కోణాల్లో ఈ చిత్రంలో కనిపించనున్నారని ఆ చిత్ర దర్శకుడు రామ్ తెలిపారు. తంగమాన్‌గళ్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు రామ్‌తదుపరి చిత్రంలో కూడా ఆండ్రియానే హీరోయిన్ అట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement