భక్తులతో కిక్కిరిసిన మేడారం | devotees rush at mini medaram jatara | Sakshi
Sakshi News home page

భక్తులతో కిక్కిరిసిన మేడారం

Feb 10 2017 2:34 PM | Updated on Sep 5 2017 3:23 AM

భక్తులతో కిక్కిరిసిన మేడారం

భక్తులతో కిక్కిరిసిన మేడారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తాడ్వాయి‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెలించారు. ఇప్పటి వరకు 30వేల మంది భక్తులు దేవతలను దర్శించుకునట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మినీ మేడారం జాతర ఈ బుధవారం ప్రారంభమైంది. దీన్నే మండ మెలిగే పండగ అంటారు.

నేటి (శుక్రవారం) మధ్యాహ్నం డీఐజీ రవివర్మ, ఎస్పీ భాస్కరన్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడి అధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మినీ మేడారం మేడారం వచ్చే భక్తులంతా తిరిగి వెళ్లే సమయంలో గట్టమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement