పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాంసం వ్యాపారుల మీదా పడింది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాంసం వ్యాపారుల మీదా పడింది. ఆదివారం రోజు జోరుగా సాగే మాంసం వ్యాపారాలు మందగించాయి. సండే రోజు చికెన్ షాపులు ముందు వరుసకట్టే వినియోగదారులు పెద్ద నోట్ల రద్దుతో ఆవైపుకే రాలేదు. దీంతో వినియోగదారులు లేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి.
మామూలుగా కార్తీక మాసంలో చికెన్ అమ్మకాలు కొద్దిగా తగ్గుతాయి. రూ.500. రూ. వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, చిల్లర సమస్యలతో మాంస్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మిగతా వ్యాపారాలు కూడా డీలా పడ్డాయి. చేపల మార్కెట్లు కూడా వెలవెలబోతున్నాయి.
సెలవురోజు చిల్లర ఖర్చులు డబ్బులు లేకపోవడంతో నాలుగో రోజు జనం ఏటీఎంల ముందు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే జనం ఏటీఎంల ముందు క్యూ కట్టారు. మరోవైపు బ్యాంకులు ఈరోజు కూడా పనిచేయనున్నాయి.