ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు | Boyfriend Fall in Well While Meeting to Lover in Tamil nadu | Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు

Jul 10 2020 9:17 AM | Updated on Jul 10 2020 9:17 AM

Boyfriend Fall in Well While Meeting to Lover in Tamil nadu - Sakshi

అన్నానగర్‌: అంబత్తూరులో ప్రియురాలిని చూడటానికి వెళ్లిన ఓ యువకుడు 75 అడుగుల లోతు బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. అంబత్తూరు వెంకటాపురం కన్నిప్ప శెట్టి వీధికి చెందిన జిలాన్‌ (22) డిప్లొమా పూర్తి చేసి సెల్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఒరగడం రోడ్డులోని  ఓ యువతిని ప్రేమించాడు. ఇతను గురువారం రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గ మధ్యలో ప్రియురాలు జ్ఞాపకం రావడంతో ఆమెను చూసే తీరాలని జిలాన్‌ ఆమె ఇంటిలోకి రహస్యంగా చొరబడ్డాడు. దీనిని పక్కింటి వారు చూసి కేకలు వేయడంతో..  ప్రియురాలి ఇంటి ఆవరణంకి పరిగెత్తి దాక్కున్నాడు. రాత్రి వేళ అక్కడున్న బావి కనిపించక అందులో పడ్డాడు. కేకలు విన్న ప్రియురాలు, ఆమె తల్లిదండ్రులు, స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తాడు సాయంతో జిలాన్‌ను రక్షించారు. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement