భార్యకు రూ. 5.5 కోట్ల కారును గిఫ్ట్గా ఇస్తే.. | BJP MLA gifts wife a saffron Lamborghini, she rams into an auto | Sakshi
Sakshi News home page

భార్యకు రూ. 5.5 కోట్ల కారును గిఫ్ట్గా ఇస్తే..

Aug 30 2016 6:30 PM | Updated on Oct 30 2018 5:17 PM

భార్యకు రూ. 5.5 కోట్ల కారును గిఫ్ట్గా ఇస్తే.. - Sakshi

భార్యకు రూ. 5.5 కోట్ల కారును గిఫ్ట్గా ఇస్తే..

బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఓ సంఘటన షాక్కు గురిచేసింది.

మహారాష్ట్రలోని థానె జిల్లా మీరా-భయందర్ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా తన భార్య సుమన్కు బర్త్ డే గిఫ్ట్గా విలువైన కానుక ఇచ్చారు. సుమన్ పుట్టినరోజయిన ఈ నెల 27న 5.5 కోట్ల రూపాయల విలువైన ల్యామ్బోర్గిని కారును ఆమెకు బహూకరించి సర్ప్రైజ్ చేశారు. బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఓ సంఘటన షాక్కు గురిచేసింది.

సుమన్ తన భర్త నరేంద్రను తీసుకెళ్లి కొత్తకారులో ట్రయల్ రన్కు వెళ్లారు. ఆమె ఉత్సాహంతో స్పీడ్గా వెళ్తూ నియంత్రణ కోల్పోయి.. ఓ స్కూల్ గేటు ముందు ఆపివున్న ఆటోను ఢీకొట్టారు. ఒక్కసారిగా షాక్కు గురైన సుమన్ కారులోనే ఉండిపోగా, నరేంద్ర కారుదిగి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆటో దెబ్బతిన్నా, డ్రైవర్ సహా ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆటో రిపేర్ చేయించుకునేందుకు ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చారు. దీంతో పోలీసు కేసు నమోదు కాలేదు. కారును అక్కడే స్కూల్ లోపల పార్క్ చేశారు.

అనంతరం నరేంద్ర మాట్లాడుతూ.. ఇది చిన్న ప్రమాదమేనని చెప్పారు. తన భార్యకు కారునడపడంలో 18 ఏళ్ల అనుభవముందని, ఆడి ఇతర లగ్జరీ కార్లను డ్రైవ్ చేసిందని తెలిపారు. కారు ఆటో ముందు భాగాన్ని తాకిందని, పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు. ల్యామ్బోర్గిని కారును స్థానిక మెకానిక్లు రిపేరి చేయలేరని, స్కూల్ లోపల పార్క్ చేశామని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement