గట్టుప్పల్‌లో బీజేపీ నేత అరెస్టు | bjp leader gangidi manohar reddy arrested | Sakshi
Sakshi News home page

గట్టుప్పల్‌లో బీజేపీ నేత అరెస్టు

Oct 15 2016 2:16 PM | Updated on Mar 29 2019 9:31 PM

నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బొడిగె సోని కుటుంబాన్ని పరామర్శించటానికి ఆయన శనివారం మధ్యాహ్నం గట్టుప్పల్‌కు చేరుకున్నారు. అయితే, గ్రామంలో 144వ సెక్షన్ అమల్లో ఉన్నందున  పరామర్శ వీలుకాదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆయన్ను అరెస్టు చేసి చండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement