జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు.
జవహర్నగర్లో భారీ చోరీ
Oct 21 2016 7:00 PM | Updated on Aug 2 2018 4:35 PM
హైదరాబాద్: జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. నాగారం లక్ష్మీనగర్ కాలనీలోని రచ్చ సుభద్రారెడ్డి అనే మహిళ ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు రూ.10 లక్షల నగదు, 8 తులాల బంగారం అపహరించారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ క్రైమ్ డీసీపీ జానకి, కుషాయిగూడ ఏసీపీ రఫిక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement