బస్‌లో మహిళలను వేధించిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Big Boss Contestant Harasses Women On Bus - Sakshi

చెన్నై: బిగ్ బాస్ 3 తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంటు, నటుడు శరవణన్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటపుడు మహిళలను తాకకూడని చోట తాకుతూ ఆనందపడే వాడినని అని తెలిపారు. అతని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. 'సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు' అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్‌ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ సమాధానం ఇచ్చారు. అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్‌ చేయడానికే బస్సు ఎక్కేవాడినని, స్నేహితులతో కలిసి ఇలాంటి పనులు చేసినట్టు వెల్లడించారు.

నెటిజన్ల ఆగ్రహం
శరవణన్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యను ఒక జోక్‌లా బిగ్‌ బాస్‌ షోలో చూపించడం దానికి ఆడియన్స్‌ చప్పట్లు కొట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడుతున్నారు.

సింగర్‌ చిన్మయి స్ట్రాంగ్‌ రిప్లై
వీడియో క్లిప్‌ని షేర్‌ చేసిన ఓ అభిమాని.. దీనిపై స్పందించమని సింగర్‌ చిన్మయిని కోరారు. ఆమె దీనికి సమాధానంగా.. ‘మహిళలను వేధించడానికే నేను బస్సు ఎక్కేవాడినంటూ ఒక వ్యక్తి గర్వంగా చెప్పుకోవడాన్ని కూడా ఛానల్స్‌ ప్రసారం చేయడం, ఇలాంటి సీరియస్‌ విషయాన్ని జోక్‌లా చూపెట్టడం, ఆడియన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరమైన విషయమంటూ వ్యాఖ్యానించారు. బిగ్‌బాస్‌ షోలో ఇప్పటి దాకా ఇంటి సభ్యుల మధ్య వివాదాల్లో మాత్రమే గొడవలు జరిగేవి. ప్రస్తుతం ఇలాంటి విషయాన్ని తేలికగా చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top