టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యతిరేక కరపత్రం విడుదల | anty government wallposter release | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యతిరేక కరపత్రం విడుదల

Oct 22 2016 5:07 PM | Updated on Sep 4 2017 5:54 PM

టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యతిరేక కరపత్రం విడుదల

టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యతిరేక కరపత్రం విడుదల

టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా ఉన్న కరపత్రాన్ని ఆవిష్కరించారు.

రామచంద్రపురం : అవకాశం దొరికిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు  వ్యతిరేకంగా ఉన్న కరపత్రాన్ని ఆవిష్కరించారు. అందులో ఆయన ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.

’ప్రభుత్వంపై మాదిగల తిరుగుబాటు మహాసభ’ కరపత్రాన్ని వెంకటాయపాలెంలోని తన సృగృహంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాదిగల సత్తా, మాదిగల గూటం దెబ్బ ఎలా ఉంటుందో బాగా తెలుసని, రిజర్వేషన్లపై స్పందించకపోతే మాదిగల సత్తా చూపి రాబోవు ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో యావత్‌ మాదిగ జాతి, మేధావులు విజ్ఞతతో ఆలోచించాలి’ అని కరపత్రంలో పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement