ఒత్తిళ్లను అధిగమిస్తేనే విజయం | Adhigamistene pressure to win | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లను అధిగమిస్తేనే విజయం

Dec 15 2013 3:26 AM | Updated on Sep 2 2017 1:36 AM

మానసిక ఒత్తిళ్లను అధిగమించినప్పుడే పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధ్యమవుతుందని ప్రముఖ నవలా రచయిత, మానసిక వైద్య నిపుణులు...

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్
 
బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : మానసిక ఒత్తిళ్లను అధిగమించినప్పుడే పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధ్యమవుతుందని ప్రముఖ నవలా రచయిత, మానసిక వైద్య నిపుణులు, ఫిల్మ్ డెరైక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు సూచించారు. స్థానిక రాఘవ కళామందిరంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దశల వారీగా శ్రీచైతన్య విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఒత్తిళ్లను తట్టుకునే విధానాలపై మెళకువలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చురుకుదనం, బుద్ధి వికాసంతో పాటు శారీరక ఎదుగుదలకు వ్యక్తిత్వ వికాసం తోడ్పడుతుందన్నారు.
 
విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందించి  ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యాభివృద్ధితోనే దేశం మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు.  ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభించాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నాపత్రం అందించి జవాబులు సరిచేసే విధానాన్ని క్షుణంగా వివరించారు. అత్యంత వినోదంగా, ఉత్సాహంగా సాగిన యండమూరి ప్రసంగం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపింది. కార్యక్రమంలో శ్రీచైతన్య పీయూ కళాశాల ప్రిన్సిపాల్ బీ.గోపాల్, శ్రీరాములు, అనిత, ఎన్ చంద్రశేఖర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement