
షామిలి రీ ఎంట్రీ
షాలిని చెల్లెలు అజిత్ మరదలు నటి షామిలి రీ ఎంట్రీ ఎట్టకేలకు జరిగింది. బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి ఔరా!
షాలిని చెల్లెలు అజిత్ మరదలు నటి షామిలి రీ ఎంట్రీ ఎట్టకేలకు జరిగింది. బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి ఔరా! అనిపించిన ఈ అమ్మాయి ఆ మధ్య హీరోయిన్‌గా పరిచయం అయి 'ఓయ్' అనే తెలుగు చిత్రం చేసేసింది. ఆ చిత్రం సుమారుగా ఆడినా ఆ తరువాత షాలిని మరే చిత్రంలోనూ నటించలేదు. అమెరికాలో సినిమాకు సంబంధించిన కోర్సు చేసి చెన్నై తిరిగొచ్చి కూడా చాలా రోజులైంది. దీంతో షాలిని మళ్లీ నటిస్తుందా? అందుకు అజిత్ పచ్చజెండా ఊపుతారా? అన్న పలు రకాల ప్రశ్నలతో కూడిన ప్రచారం కోలీవుడ్‌లో జరిగింది.
వాటన్నింటికి సమాధానంగా షామిలి రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆమె ఇప్పుడు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుధీప్ హీరోగా తమిళం, కన్నడం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో షామిలి హీరోయిన్. కె ఎస్ రవికుమార్ దర్శకుడు. చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలు శుక్రవారం బెంగళూరులో జరిగాయి.
రజనీకాంత్ నటించిన లింగా చిత్రానికి దర్శకత్వం వహించిన కేఎస్ రవికుమార్ ఆ చిత్రానికి ఎదురైన సమస్యల కారణంగా చాలా మనస్తాపానికి గురైనట్లు ఇకపై దర్శకత్వమే చేయననే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. కిచ్చా సుధీప్ హీరోగా రూపొందించాల్సిన చిత్రం కూడా డ్రాప్ అయినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. అలాంటి పరిణామాల మధ్య కిచ్చా సుధీప్, కేఎస్ రవికుమార్‌ల చిత్రంలో హీరోయిన్‌గా షామిలి నటించడం టాక్ ఆఫ్‌ది టాక్‌గా మారింది. ఈ చిత్రం రాంబాబు ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది.