కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ, ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని
‘ఆప్ ప్రభుత్వం త్వరలోనే కూలుతుంది’
Dec 28 2013 1:02 AM | Updated on Mar 29 2019 9:18 PM
కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ, ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఏ సమయంలోనైనా ప్రభుత్వాన్ని కూల్చే అవకాశముంది కాబట్టి తాజా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని విధానసభ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు సూచించారు. చరిత్రలోనే అత్యంత అవినీతికరపార్టీ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆప్ పరిశుద్ధ రాజకీయాలు చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఆప్‌కు మద్దతుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు.
Advertisement
Advertisement