నయీం కేసులో పలువురికి కస్టడీ | 9 days police custody to nayeem followers | Sakshi
Sakshi News home page

నయీం కేసులో పలువురికి కస్టడీ

Sep 8 2016 12:51 PM | Updated on Aug 21 2018 7:17 PM

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది.

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నయీం అనుచరులను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. తాజాగా చర్లపల్లి జైల్లో ఉన్న నయీం అనుచరులు సమీరుద్దీన్, శ్రీధర్‌గౌడ్‌లను 9 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా సంజీవ్‌రెడ్డి, శ్రీహరిలకు నాలుగు రోజులు, అబ్దుల్ ఫహీం, సామ్యూల్‌లకు రెండు రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement