చరిత్ర సృష్టించిన అమెరికా | Women's World Cup: Lloyd's hat-trick leads US to third titlev | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అమెరికా

Jul 7 2015 12:04 AM | Updated on Apr 4 2019 4:25 PM

చరిత్ర సృష్టించిన అమెరికా - Sakshi

చరిత్ర సృష్టించిన అమెరికా

మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అమెరికా జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ కార్లీ లాయిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో

మూడోసారి మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ కైవసం
 ఫైనల్లో 5-2తో జపాన్‌పై విజయం

 వాంకోవర్: మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అమెరికా జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ కార్లీ లాయిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను 5-2తో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌ను మూడు సార్లు సాధించిన తొలి జట్టుగా అమెరికా రికార్డులకెక్కింది. గతంలో 1991, 1999లోనూ ఈ మెగా కప్‌ను అందుకుంది.  లాయిడ్‌కు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. 2011 ఫైనల్స్‌లో జపాన్‌తోనే ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో బరిలోకి దిగిన అమెరికాకు... కార్లీ లాయిడ్ అత్యద్భుత ఆటతీరు చూపెట్టి 13 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్‌తో స్పష్టమైన ఆధిక్యాన్ని అందించింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓ ప్లేయర్ మూడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement