వరుసగా రెండో టెస్టులోనూ జరిమానా | Windies fined second time for slow over rate | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో టెస్టులోనూ జరిమానా

Dec 12 2017 4:40 PM | Updated on Oct 2 2018 4:31 PM

Windies fined second time for slow over rate - Sakshi

హామిల్టన్‌:న్యూజిలాండ్‌తో ఇక్కడ జరిగిన రెండో టెస్టులోనూ స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా వెస్టిండీస్‌ జట్టుకు జరిమానా పడింది. వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌తో జరిమానాతో పాటు కెప్టెన్‌ జాసన్‌ హెల్డర్‌పై సస్పెన్షన్‌ చవిచూసిన వెస్టిండీస్‌.. రెండో టెస్టులో కూడా అదే తప్పిదాన్ని పునరావృతం చేసింది. దాంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సూచన మేరకు విండీస్ తాత్కాలిక కెప్టెన్‌ బ్రాత్‌ వైట్‌ మ్యాచ్ ఫీజులో 40 శాతం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

రెండో టెస్టులో కేటాయించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే విండీస్ ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో జరిమానా పడింది. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులోనూ మూడు ఓవర్లు తక్కువగా వేయడంతో కెప్టెన్ హోల్డర్ మ్యాచ్ ఫీజులో 60 శాతం, ఆటగాళ్ల ఫీజులో 30 శాతం ఐసీసీ కోత విధించింది. ఏడాది వ్యవధిలో విండీస్ ఇదే తప్పిదానికి పాల్పడి ఉండటంతో కెప్టెన్ హోల్డర్‌ని రెండో టెస్టు నుంచి సస్పెండ్‌ చేశారు. కాగా, రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ 240 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ​క్లీన్‌స్వీప్‌ చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement