సాకేత్‌కు వైల్డ్‌ కార్డు | Wild card for Saket | Sakshi
Sakshi News home page

సాకేత్‌కు వైల్డ్‌ కార్డు

Nov 11 2017 12:10 AM | Updated on Nov 11 2017 12:10 AM

Wild card for Saket - Sakshi

ముంబై: పుణే ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేనికి సింగిల్స్‌ విభాగంలో వైల్డ్‌ కార్డు కేటాయించారు. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో సాకేత్‌తోపాటు భారత్‌కే చెందిన శ్రీరామ్‌ బాలాజీ, ఆర్యన్‌ గోవిస్, అర్జున్‌ ఖాడేలకు కూడా నిర్వాహకులు వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చారు.

ప్రపంచ 86వ ర్యాంకర్‌ రాడూ అల్బోట్‌ (మాల్డొవా), ప్రపంచ 98వ ర్యాంకర్‌ బ్లాజ్‌ కావిచ్‌ (స్లొవేనియా), భారత నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌ రామనాథన్, గతేడాది రన్నరప్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గాయాల కారణంగా ఈ ఏడాది ఎక్కువ భాగం ఆటకు దూరం కావడంతో సాకేత్‌ సింగిల్స్‌ ర్యాంక్‌ 912కు పడిపోయింది. శని, ఆదివారాల్లో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement