
చెలరేగిన ఇర్ఫాన్
సీనియర్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (3/10) నిప్పులు చెరగడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో వెస్ట్ జోన్ జట్టు 8 వికెట్ల
నార్త్ జోన్‌పై వెస్ట్ జోన్ విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ
ముంబై: సీనియర్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (3/10) నిప్పులు చెరగడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో వెస్ట్ జోన్ జట్టు 8 వికెట్ల తేడాతో నార్త్ జోన్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా నార్త్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఓపెనర్ గంభీర్ (60; 4 ఫోర్లు 1 సిక్స్) ఒక్కడే రాణించాడు.
ఇర్ఫాన్ తన పదునైన బంతులతో శిఖర్ ధావన్ (3), రిషబ్ పంత్ (2), యువరాజ్ సింగ్ వికెట్లను తీయడంతో నార్త్ కోలుకోలేకపోయింది. అనంతరం వెస్ట్ జట్టు 12.4 ఓవర్లలోనే రెండు వికెట్లకు 108 పరుగులు చేసి నెగ్గింది. మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ నెగ్గింది.