అనుష్కకు కోహ్లీ బై.. బై..! | virat kohli sends off anushka sharma at airport | Sakshi
Sakshi News home page

అనుష్కకు కోహ్లీ బై.. బై..!

Jun 3 2016 11:43 AM | Updated on Sep 4 2017 1:35 AM

అనుష్కకు కోహ్లీ బై.. బై..!

అనుష్కకు కోహ్లీ బై.. బై..!

క్రికెట్ - బాలీవుడ్ ప్రేమజంట విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ విడిపోయారా, కలిసున్నారా అనే ప్రశ్న ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. తాజాగా బుడాపెస్ట్ వెళ్తున్న అనుష్కను కోహ్లీ దగ్గరుండి సాగనంపాడట.

క్రికెట్ - బాలీవుడ్ ప్రేమజంట విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ విడిపోయారా, కలిసున్నారా అనే ప్రశ్న ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. తాజాగా బుడాపెస్ట్ వెళ్తున్న అనుష్కను కోహ్లీ దగ్గరుండి సాగనంపాడట. సల్మాన్‌ఖాన్ సరసన అనుష్క నటిస్తున్న సుల్తాన్ సినిమా తదుపరి షూటింగ్ బుడాపెస్ట్‌లో జరగాల్సి ఉంది. అందుకోసం ఆమె వెళ్తుంటే.. ముంబై విమానాశ్రయం వద్ద విరాట్ కోహ్లీ ఆమెను దగ్గరుండి సాగనంపాడు. వాళ్లిద్దరూ కలిసుండగా ఫొటోగ్రాఫర్లకు దొరికారు. ఒక కారులో ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటో దొరకడంతో అదిప్పుడు సోషల్ మీడియా జనాలకు మళ్లీ హాట్ హాట్ కబురుగా మారింది. రెండు వారాల వ్యవధిలో వీళ్లిద్దరూ ఇలా కలిసి కనిపించడం ఇది రెండోసారి. దాంతో ఇద్దరూ కలిసిపోయినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ నెలలో విరాట్ - అనుష్కలు ముంబై రెస్టారెంటులో డిన్నర్ చేస్తుండగా ఫొటోగ్రాఫర్లకు దొరికారు. కొన్ని నెలల క్రితం తాము విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత ఇద్దరూ కలిసి కనిపించడం అదే మొదటిసారి. 2013 నుంచి వీళ్లు డేటింగ్‌లో ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరమే విడిపోయినట్లు సింబాలిక్‌గా చెప్పారు. కోహ్లీ ట్విట్టర్‌లో అనుష్కను అన్ ఫాలో కావడంతో పాటు 'గుండె పగిలింది' అనే కేప్షన్‌తో ఓ ఫొటో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇద్దరినీ కలపడంలో బాలీవుడ్ సీనియర్ బ్రహ్మచారి సల్మాన్‌ ఖాన్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement