నయా పోస్ట్‌... సుందర్‌ దోస్త్‌...  | Virat Kohli New Post On Twitter Naya Post Sundar Dost Viral | Sakshi
Sakshi News home page

నయా పోస్ట్‌... సుందర్‌ దోస్త్‌... 

Feb 17 2020 8:36 AM | Updated on Feb 17 2020 8:38 AM

Virat Kohli New Post On Twitter Naya Post Sundar Dost Viral - Sakshi

హామిల్టన్‌: మైదానంలో సీరియస్‌గా ఉండే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెలుపల మాత్రం సరదాగానే ఉంటాడు. ఈ సరదా సన్నివేశాల్ని సామాజిక సైట్లలో పంచుకునేందుకు కూడా అతనెప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. తన ప్రియమైన శ్రీమతి అనుష్కతో విహారయాత్రల్లో మునిగితేలుతున్న ఫొటోల్ని కూడా పోస్ట్‌ చేసే విరాట్‌... ఇపుడు కుర్రాడు పృథ్వీ షా, సీనియర్‌ పేసర్‌ షమీలతో కనుగుడ్లను మెలిపెట్టే ఫోజుతో సరదా తీర్చుకున్నాడు. అన్నట్లు దీనికి ‘నయా పోస్ట్‌... సుందర్‌ దోస్త్‌’ (అందమైన మిత్రులతో కొత్త పోస్ట్‌) అనే చక్కని క్యాప్షన్‌ని కూడా జత చేశాడు. ( మయాంక్, పంత్‌ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్‌’)

ఇది షమీ తీసిన సెల్ఫీ. షమీ ముందు వరుసలో ఉంటే వెనుక కోహ్లి, షా తమ కనుగుడ్లను మెలిపెడుతూ కనిపించారు. కివీస్‌ పర్యటనలో వన్డే, టి20 సిరీస్‌లను ముగించిన టీమిండియా మిగిలున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు జరుగుతుంది. ఇప్పటికైతే కోహ్లి టీమ్‌ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో టాప్‌ ర్యాంక్‌లో దూసుకెళుతోంది. ఏడు మ్యాచ్‌ల ద్వారా 300 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో ఉంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement