ఐపీఎల్‌లో వారిద్దరూ స్పెషల్‌ | Virat Kohli class, Chris Gayle T20 master: Kane Williamson | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో వారిద్దరూ స్పెషల్‌

Apr 22 2017 2:44 PM | Updated on Sep 5 2017 9:26 AM

ఐపీఎల్‌లో వారిద్దరూ స్పెషల్‌

ఐపీఎల్‌లో వారిద్దరూ స్పెషల్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, క్రిస్‌ గేల్‌పై సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసలు కురిపించాడు.

న్యూఢిల్లీ: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, క్రిస్‌ గేల్‌పై సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2017 సీజన్‌లో కోహ్లీ, గేల్‌ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు.

వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లని, వీరి ఆటతీరు భిన్నంగా ఉంటుందని కేన్‌ అన్నాడు. కోహ్లీ క్లాస్‌ ఆటగాడైతే, క్రిస్‌ టి-20 మాస్టర్‌ అంటూ కితాబిచ్చాడు. బెంగళూరు జట్టును ఓడించడం చాలా కష్టమని అన్నాడు. గేల్‌ను అవుట్‌ చేస్తే, కోహ్లీ రూపంలో మరో ప్రమాదం ఎదురవుతుందని, వీరిద్దరూ డామినేట్‌ చేయగల ఆటగాళ్లని చెప్పాడు. ఇటీవల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయంలో విలియమ్సన్‌ కీలక పాత్ర పోషించాడు. అతను 51 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement