తిరుగు ప్రయాణంలో మళ్లీ దొరికిపోయారు! | Virat Kohli and Anushka Sharma Snapped again in return journey | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణంలో మళ్లీ దొరికిపోయారు!

Jan 4 2017 12:14 PM | Updated on Oct 22 2018 6:05 PM

తిరుగు ప్రయాణంలో మళ్లీ దొరికిపోయారు! - Sakshi

తిరుగు ప్రయాణంలో మళ్లీ దొరికిపోయారు!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ మరోసారి వారల్లో నిలిచారు.

డెహ్రాడూన్: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. క్రిస్మస్ సంబరాలను కలిసి జరుపుకున్న వీరిద్దరూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. డెహ్రాడూన్ లో విమానంలో వీరు ఉండగా క్లిక్ మనిపించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తమ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న వీరు తిరిగి తమ ప్రాంతాలకు తిరుగు పయనమవగా ఈ ఫొటో తీసినట్లు కనిపిస్తోంది. తన ప్రేయసి అనుష్క భుజంపై కోహ్లీ చేయి వేసినట్లు ఫొటోలో చూడవచ్చు. మరోవైపు ఇంగ్లండ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ ముగియడంతో కోహ్లీ, తన ప్రేయసి అనుష్కతో కలిసి వారం రోజుల వెకేషన్ కోసం డెహ్రాడూన్ వెళ్లాడు. న్యూ ఇయర్ కోసం ముందే ప్లాన్ చేసుకున్న అనుష్క కొన్ని రోజులపాటు షూటింగ్ నుంచి విరామం తీసుకుంది.

ఇద్దరు సెలబ్రిటీలు ఈ విధంగా కనిపించడంతో ఎయిర్ పోర్ట్‌లో ఉన్న కొందరు ఓ ఫొటో క్లిక్ మనిపించి పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. న్యూతన సంవత్సరం తొలిరోజున కోహ్లీ, అనుష్క ఎంగేజ్ మెంట్ జరగనుందని భిన్న కథనాలు ప్రచారం కాగా, నిశ్చితార్థం, పెళ్లి ఇలాంటి వార్తలను అందరికీ చెప్పే సెలబ్రేట్ చేసుకుంటామని, ఇందులో దాపరికం లేదని కోహ్లీ న్యూ ఇయర్ కు ముందే ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement